contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారెంటీలు పెద్ద బోగస్… మోసం…!?

  • రెండున్నర ఏళ్లయిన 6 గ్యారంటీలను అమలు చేయలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం..
  • బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నీకేష్

కరీంనగర్ జిల్లా: గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిందని, ముఖ్యంగా ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజలను నమ్మించి మోసం చేసిందని , కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారెంటీలు పెద్ద బోగస్ అని బిజెపి గన్నేరువరం మండల అధ్యక్షులు తిప్పర్తి నీకేష్ ఘాటుగా విమర్శించారు. బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సోమవారం బిజెపి గన్నేరువరం మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షుడు తిప్పర్తి నీకేష్ మాట్లాడుతూ రెండున్నర ఏళ్లయిన 6 గ్యారంటీలను అమలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితిల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఒక ఫ్రీ బస్సు ను కల్పించి మహిళలకు ప్రతి నెల రూ. 2500 , రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ను ఎగ్గొట్టిందన్నారు’ రైతు భరోసా”కు భరోసా లేకుండా పోయిందన్నారు. రైతు భరోసా అందించడానికి అనేక కొర్రీలు పెడుతూ రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేసిందన్నారు. రైతు కూలీల రైతు భరోసా కు మంగళం పాడిందన్నారు. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలోరూ.15 వేల రైతు భరోసా అందిస్తామని ప్రకటించి రూ.12 వేలకు కుదింపు చేసి రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేసిందన్నారు.యువ వికాస పథకాన్ని గాలికి వదిలేసిందన్నారు.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇంటర్నేషనల్ స్కూల్స్ ల ఏర్పాటు పత్తా లేకుండా పోయిందన్నారు.చేయూత ” పథకానికి కాంగ్రెస్ సర్కార్ చేయించిందని, పెన్షన్లను పెంచుతామని పెన్షన్ దారులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. రూ. 4000 పెన్షన్ ఇవ్వడానికి హస్తం పార్టీకి చేతులు రావడం లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇడ్ల స్థలం ఉన్నవారికి 5 లక్షల ఆర్థిక సాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కిచ్చిందన్నారు. గృహజ్యోతి పథకం కింద అర్హులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే స్కీంను తూతూ మంత్రంగా అమలు చేసి చేతులు దులుపుకుందని ఆయన మండిపడ్డారు. ఆరూగ్యారంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గారంటీలను అమలు చేసేదాకా ప్రజలందరికీ బిజెపి అండగా నిలుస్తుందన్నారు. ప్రజల పక్షాన ఎలాంటి పోరాటానికైనాబిజెపి ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని , ఆరూ గ్యారెంటీ ల అమలు విషయంలో వెనకడుగు వేసే పరిస్థితి లేదని, కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచైనా గ్యారంటీలను సాధించేవరకు విశ్రమించమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, ఏలేటి చంద్రారెడ్డి, విలాసాగరం రామచంద్రం, మచ్చ బాలరాజు, బండి తిరుపతి, మచ్చ మురళీకృష్ణ, అటికం రామచంద్రం, గాలి పెళ్లి శంకర్, దొగ్గలి జగన్, కాంతల రాజిరెడ్డి, గొట్టే రవి, చుక్కల లక్ష్మయ్య, బూట్ల సంపత్, మద్దూరి మహేందర్, చుక్కల స్వామి, కూన ప్రశాంత్, దానవేణు ప్రశాంత్, ఏలేటి సత్యంరెడ్డి, కాట్నపెళ్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :