contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మీనాక్షి వైన్ షాప్ వద్ద నిబంధనలు గాలికి.. కలుషిత నీరు, అక్రమ రవాణాపై వెల్లువెత్తుతున్న విమర్శలు !

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: పట్టణంలోని మీనాక్షి వైన్ షాప్ అక్రమాలకు, అపరిశుభ్రతకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం విక్రయాల్లో ఎక్సైజ్ నిబంధనలను పట్టించుకోకపోవడమే కాకుండా, వినియోగదారుల ఆరోగ్యంతో నిర్వాహకులు చెలగాటమాడుతున్నారనే విమర్శలు స్థానికంగా గట్టిగా వినిపిస్తున్నాయి.

నాణ్యత లేని వాటర్ ప్యాకెట్లు:
కాగజ్‌నగర్ పట్టణంలో ఈ వైన్ షాప్‌కు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూమ్ (సిట్టింగ్)లో ఎటువంటి అనుమతులు లేని నాసిరకం వాటర్ ప్యాకెట్లను విక్రయిస్తున్నారని సమాచారం. ఐఎస్‌ఐ గుర్తు లేని ఈ నీటిని వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదకరంగా డస్ట్ బిన్లు:
తిరందాస్ బస్తి ప్రాంతంలో ఈ షాప్ ముందు ప్రధాన రహదారికి ఆనుకుని డస్ట్ బిన్లు ఏర్పాటు చేయడం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇవి స్పష్టంగా కనిపించక వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

పట్టపగలే అక్రమ రవాణా:
మీనాక్షి వైన్ షాప్ నుంచి అనుమతి లేని బెల్ట్ షాపులకు, ఇతర ప్రాంతాలకు పట్టపగలే మద్యం బాక్సులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఈ అక్రమ రవాణా జరుగుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డిస్కో గ్లాసుల వినియోగం:
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్/డిస్కో గ్లాసులను విస్తృతంగా వినియోగించడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. వాడి పారేసిన గ్లాసులు చెత్తగా పేరుకుపోయి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి.

అధికారులు స్పందించాలి:
మున్సిపల్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి మీనాక్షి వైన్ షాప్ వద్ద జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :