- మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూపు..
కరీంనగర్ జిల్లా: పొట్ట కూటికోసం దుబాయ్ వెళ్లిన గన్నేరువరం మండలం లోని ఖాసీంపేట గ్రామానికి చెందిన వేదిర శ్రీనివాస్ వయస్సు (45) సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందాడు. రెక్కాడితే డొక్కాడని ఆ కుటుంబం.. పెద్దదిక్కు కోల్పోవడం తో ఏమిచేయాలో తెలియని పరిస్థితి, కడచూపు కూడా కరువవుందని దుఃఖ సాగరంలో మునిగిపోయింది ఆ కుటుంబం.. శ్రీనివాస్ దుబాయ్ లోని అబుదాబి లో కుక్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. అనారోగ్య సమస్యలతో మూడు నెలల నుండి దుబాయ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 18న శ్రీనివాసు మృతి చెందాడు.ఈ విషయాన్ని భార్య శ్రీలత కి సమాచారం అందించారు. దీంతో విదేశాంగ శాఖ ద్వారా దుబాయ్‌లోని భారత్ ఎంబసీ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం.. మృతదేహాన్ని దుబాయ్ నుంచి హైదరాబాద్ కి బుధవారం లేదా గురువారం స్వగ్రామం ఖాసీంపేట గ్రామానికి చేరుకొనుంది.. శ్రీనివాస్ కి భార్యతోపాటు ఒక కూతురు ఉన్నారు. శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గన్నేరువరం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.








