వేమనపల్లి (మంచిర్యాల జిల్లా) : మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలోని నిల్వాయి గ్రామ పోలీస్ స్టేషన్‌లో గురువారం జైపూర్ సబ్‌డివిజన్ ఏసీపీ వెంకటేశ్వర్లు వార్షిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నమోదైన వివిధ కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, వాటి నిర్వహణ తీరును సమీక్షించారు. అలాగే స్టేషన్‌లోని భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా, పోలీస్ స్టేషన్ ఆవరణలో పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమైన ఏసీపీ వెంకటేశ్వర్లు ప్రజలకు త్వరితగతిన, న్యాయబద్ధమైన సేవలు అందించాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పని చేయాలని, శాఖ ప్రతిష్టను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ, నిల్వాయి ఎస్‌ఐ జగదీష్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.








