contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏసీబీ వలలో గ్రామ పరిపాలన అధికారి

జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీలో గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ) రాజేష్ రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. పాస్‌బుక్‌లో నమోదైన పేరును సరిచేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని నిందితుడిని పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆత్మకూరు గ్రామానికి చెందిన మల్లేష్ తన పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైన పేరును సరిచేయించుకోవడానికి జీపీఓ రాజేష్‌ను సంప్రదించాడు. అయితే పని పూర్తి చేయాలంటే రూ.5 వేల లంచం ఇవ్వాలని రాజేష్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించి, నిర్ణీత ప్రదేశంలో బాధితుడు నుంచి రూ.5 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో రాజేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లంచం నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, కార్యాలయంలోని సంబంధిత ఫైళ్లు, రికార్డులు, ఇతర పత్రాలను పరిశీలించి సీజ్ చేశారు.

ఈ ఘటనపై నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లేదా ఉద్యోగులు పనుల కోసం లంచం డిమాండ్ చేసినా లేదా స్వీకరించినా వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే అవినీతిని అరికట్టడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :