contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కుల వివక్ష లేని సమాజం కోసం పోరాడాలి : గోవిందరావు పిలుపు

రావికమతం, అనకాపల్లి జిల్లా : కుల వివక్షకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం దళితులు, గిరిజనులు ఐక్యంగా పోరాడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే. గోవిందరావు పిలుపునిచ్చారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రావికమతం మండలం గర్నికం గ్రామంలోని దళిత కాలనీలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గోవిందరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయినా దళితుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చోడవరం నియోజకవర్గ పరిధిలో దళితులకు ప్రత్యేక స్మశాన వాటిక కోసం రెండు ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటి అమలు జరగడం లేదని ఆయన ఆరోపించారు. డి-పట్టా భూములు కలిగి సాగు చేసుకుంటున్న దళితుల భూములను సర్వేల పేరుతో రెవెన్యూ రికార్డుల్లో గయ్యాల భూములుగా నమోదు చేస్తున్నారని విమర్శించారు.

దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి

దళిత కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దళిత కాలనీల అభివృద్ధికి పూర్తిస్థాయిలో వినియోగించడం లేదని గోవిందరావు అన్నారు.

రోలుగుంట మండలం బుచ్చింపేటలో దళితులకు ప్రత్యేక స్మశాన వాటిక లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గర్నికం దళిత కాలనీలో ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేసినప్పటికీ తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని పేర్కొన్నారు. అజ్జాపురం పంచాయతీ పరిధిలోని దళిత కాలనీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా దళితుల స్మశాన వాటికలు, మౌలిక వసతుల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కుల వివక్ష లేని సమాజ నిర్మాణం, సామాజిక న్యాయం సాధన కోసం దళితులు, గిరిజనులు ఐక్యంగా ఉద్యమించాలని గోవిందరావు పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలను మరింత బలోపేతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే. గోవిందరావు, కేవీపీఎస్ జిల్లా నాయకులు ఎత్తులో కళ్యాణం, ప్రైవేట్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :