మాచర్ల, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల పట్టణం 18వ వార్డుకు చెందిన పట్రా నాగరాజు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తల్లి పిన్నెల్లి రాములమ్మ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
నాగరాజు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాములమ్మ, కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా నిలిచేందుకు అంత్యక్రియల మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని రాములమ్మ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలా శ్రీనివాసరావు, మాచర్ల సుందర్రావు, జలీల్, బూదాల మరియమ్మ, అల్లి జీవన్, నాగూర్, కోట రాజేష్, మాచర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని నాగరాజుకు నివాళులర్పించారు.









