contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కోర్టు తీర్పును ధిక్కరించి సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో భూ వివాదానికి సంబంధించి సోమవారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నారు. కోర్టు తమకు అనుకూలంగా తుది తీర్పునిచ్చినప్పటికీ, ఓ వ్యక్తి పాత పద్ధతిలోనే మళ్లీ హల్చల్ చేస్తూ సెల్ టవర్ ఎక్కడం స్థానికంగా కలకలం రేపింది.

ఘటన నేపథ్యం & వివరాలు:
వంశపారంపర్య భూమి: గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బుర్ర రాందాస్ మరణానంతరం, ఆయన పేరిట ఉన్న సర్వే నంబర్ 533 లోని 30 గుంటల భూమిని ఆయన ముగ్గురు కుమారులు సమానంగా (మనిషికి 10 గుంటల చొప్పున) 2018లో విరసత్ పట్టా చేయించుకున్నారు. అప్పటి నుంచి వారు ఆ భూమిలో పునాస సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అక్రమ దౌర్జన్యం – తప్పుడు కేసులు: ఇదే క్రమంలో 2020 సంవత్సరంలో గ్రామానికి చెందిన న్యాత ప్రవీణ్ (తండ్రి పోచయ్య) ఆ భూమిని దౌర్జన్యంగా కబ్జా చేయడానికి యత్నించగా, బాధితులు వ్యతిరేకించారు. దీంతో ప్రవీణ్… బుర్ర మల్లయ్య, బుర్ర అంజయ్య, బుర్ర అరుణ, బుర్ర రాజ్ కోటి తదితరులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద తప్పుడు కేసులు బనాయించడంతో వారు జైలుపాలవ్వాల్సి వచ్చింది.
న్యాయ పోరాటం – కోర్టు తీర్పు: దాదాపు ఐదు సంవత్సరాల పాటు బాధితులు కోర్టు చుట్టూ తిరిగి న్యాయపోరాటం చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఎస్సీ, ఎస్టీ కేసులు తప్పుగా బనాయించినట్లు తేల్చి, 2025 నవంబర్ 2న ఆ కేసులను కొట్టివేసింది. అంతేకాకుండా, బాధితులకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్‌తో పాటు పూర్తి తీర్పు కూడా వెలువరించింది.

నేడు సెల్ టవర్ ఎక్కిన వైనం:
కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినప్పటికీ, సోమవారం (ఆగస్టు 24) నాడు న్యాత ప్రవీణ్ అనే యువకుడు మళ్లీ పాత పద్ధతిని తెరపైకి తెచ్చాడు. సర్వే నెం. 533/B/D లోని 30 గుం. లు మొత్తం భూమి తనదేనంటూ గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ఈ చర్య ద్వారా అతను ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధితుల డిమాండ్:
కోర్టు ద్వారా చట్టబద్ధంగా న్యాయం పొంది, ఐదేళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్న తమను అకారణంగా వేధిస్తూ, నిత్యం ఆందోళనలకు దిగుతున్న సదరు వ్యక్తిపై ప్రభుత్వం మరియు పోలీస్ అధికారులు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భూ బాధితులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు & రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి మరీ .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :