గోదావరిఖని : గోదావరిఖని పట్టణంలోని 8వ డివిజన్ పరిధిలో ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులతో పాటు SIR ఫేజ్-2 ప్రక్రియపై బీఆర్‌ఎస్ నాయకులు పరిశీలన చేపట్టారు. బీఆర్‌ఎస్ నాయకులు నిజాముద్దీన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.
SIR ఫేజ్-2లో భాగంగా అధికారులు, బూత్ లెవల్ అధికారులు (BLOలు) చేపడుతున్న ఓటరు వివరాల పరిశీలన ప్రక్రియను నాయకులు పరిశీలించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, ఓటరు వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు.
ఓటరు జాబితా పరిశీలన ప్రక్రియను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, తమ పేరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవడంతో పాటు వివరాలను సరిచూసుకోవాలని ప్రజలకు సూచించారు. అర్హులైన ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వివరాలను నమోదు, సవరణ చేసుకునేలా సహకరిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు శారద, రమాదేవి, విజయలక్ష్మి, రజితతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









