గోదావరిఖని: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్లోని జ్యోతినగర్ నుంచి 5 ఇంక్లైన్ వరకు ఉన్న ప్రధాన కాలువ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. రెండు నెలలుగా కాలువను పూర్తిస్థాయిలో శుభ్రం చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
భారీ వర్షాలు కురిస్తే నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి 5 ఇంక్లైన్ ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ నుంచి దుర్వాసన రావడంతో పాటు దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెబుతున్నారు.
మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ప్రధాన కాలువను శుభ్రం చేసి, మురుగు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని 11వ డివిజన్ ప్రజలు కోరుతున్నారు.








