contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎన్నికల హామీలు అమలు చేయకుంటే పతనం తప్పదు : సిపిఎం

తిమ్మాపూర్, కరీంనగర్ జిల్లా: గత ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయలని సిపిఎం పార్టీ తిమ్మాపూర్ మండల కార్యదర్శి కామ్రేడ్ మాతంగి శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం తిమ్మాపూర్ మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పార్టీ కార్యదర్శి మాతంగి శంకర్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో అనేక బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి,డబ్బు, మద్యం, పంపిణీ తో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో తిమ్మాపూర్ నుండి పోరండ్ల వరకు డబుల్ సిసి రోడ్డు కోరకు మంజురైన రెండు కోట్ల రూపాయలను ఇప్పటివరకు ఖర్చు చేయకపోవడం ప్రభుత్వం చాతకానీ తనానికి నిదర్శనం అన్నారు. రెండుసార్లు కొబ్బరి కాయలు కొట్టిన ఎమ్మెల్యే,నాయకులు పనులు చేయడం మాత్రం మరిచి పొయారని ఆవేదన వ్యక్తంచేశారు. రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు.ప్రైవేటు స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టం తెవాలని డిమాండ్ చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు. పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించి , యాప్ లేకుండా సోసైటిల ద్వారా డైరెక్ట్ గా తీసుకునే విధంగా అందుబాటులో ఉంచాలన్నారు. కళ్యాణలక్ష్మీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం స్వంత జాగలేని పెదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని రంగాన్ని బలోపెతం చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే అన్ని పార్టీలను, వర్గాల ప్రజలను రాజకీయాలకు అతీతంగా ఏకం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాతంగి వెంకటస్వామి, మాతంగి రాజయ్య,గోపు అయిలయ్య,బోల్ల మొగిళి, మాతంగి రాయమల్లు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :