పల్నాడు జిల్లా – మాచర్ల: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను మాచర్ల పట్టణంలో జనసేన నాయకుడు వకీల్ సాబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నెహ్రూనగర్ మొదటి లైన్‌లోని బీసీ సామాజికవర్గ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా వకీల్ సాబ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను నిర్వహించారు.
అయితే జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు. రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేయడంతో పాటు మహిళలకు చీరలను అందజేశారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో పవన్ కల్యాణ్ జన్మదినాన్ని నిర్వహించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వకీల్ సాబ్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. పేదలు, బలహీన వర్గాలు, మహిళలకు అండగా నిలవడం ప్రతి జనసేన కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో రఘువర్మ, బత్తుల శివ, నాగేశ్వరరావు, చక్రధర్, బొజ్జం మల్లికార్జునరావు, పవన్, కొమ్ము రాజుతో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.








