తూప్రాన్ డివిజన్ : ఇటీవల కాలంలో ఏటీఎం దొంగతనాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో తూప్రాన్ డీఎస్పీ జె. నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్బీఐ ఏటీఎం విభాగం అధికారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏటీఎంల వద్ద భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు దొంగతనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా పోలీసులు ఏటీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. పాత ఏటీఎం మెషిన్లను తొలగించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త ఏటీఎం మెషిన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను నియమించాలని కోరారు.
అలాగే ఏటీఎం కేంద్రాల వద్ద హైక్వాలిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి 24 గంటల పాటు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏటీఎంల భద్రత కోసం ESS సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు.
ఈ సమావేశంలో పోలీస్ శాఖ నుంచి తూప్రాన్ డీఎస్పీ, మెదక్ డీఎస్పీ, రామాయంపేట సీఐ, డీసీఆర్బీ సీఐ జార్జ్ పాల్గొన్నారు.
ఎస్బీఐ ఏటీఎం విభాగం నుంచి రాజేష్ ప్రసాద్ – జనరల్ మేనేజర్, TG SBI ATM ఇన్చార్జ్, జయప్రసాద్ – ఫీల్డ్ ఆఫీసర్, CMS TG, ఆనంద్ రాజ్ – ATM TG సెక్యూరిటీ ఇన్చార్జ్, మారుతి – RM, భువనేశ్వరి – DGM, ప్రశాంత్ – ATM క్యాష్ ఇన్చార్జ్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయడం ద్వారా దొంగతనాలను అరికట్టడంతో పాటు ప్రజల నగదు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు స్పష్టం చేశారు.








