contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎండీ ముస్తఫా

గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా: రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడిగా రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఎండీ ముస్తఫాను నియమించారు. ఈ మేరకు బుధవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ చేతుల మీదుగా ముస్తఫా నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎండీ ముస్తఫా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కార్పొరేటర్‌గా రెండోసారి గెలిచిన తనను గుర్తించి కార్పొరేషన్ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు.

రామగుండంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తతో కలిసి పనిచేస్తామని ముస్తఫా తెలిపారు. రాబోయే ఎన్నికల్లో రామగుండంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడంతో పాటు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్‌ను రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

గతంలో కార్పొరేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన బొంతల రాజేష్ స్థానంలో ఎండీ ముస్తఫాను కొత్త అధ్యక్షుడిగా నియమించారు. రెండోసారి కార్పొరేటర్‌గా గెలిచిన ముస్తఫాకు ఈ బాధ్యతలు అప్పగించారు.

తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ముస్తఫా కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :