contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కుంటలా మారిన గన్నేరువరం – కరీంనగర్ ప్రధాన రహదారి

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రం నుంచి కరీంనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రహదారిపై భారీ గుంతలు ఏర్పడటంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు వాటిలో నీరు నిలిచిపోయి రోడ్డు కాస్తా నీటి కుంటలను తలపిస్తోంది.

గుంతల్లో నిలిచిన నీటిలో ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ప్రయాణిస్తున్న దృశ్యాలు రహదారి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా గుంతల లోతు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు వాహనదారులు గుంతల్లో పడి గాయపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని వారు తెలిపారు.

ప్రధాన రహదారి కావడంతో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారి దుస్థితి కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గుంతలు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి, గుంతలను పూడ్చి వాహనదారులకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించాలని వారు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :