contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

5 కోట్ల వత్తులతో సముద్రునికి కుంభహారతి

కాకినాడ రూరల్ : సామూహిక గణపతి ఉత్సవ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కాకినాడ రూరల్ సూర్యారావుపేట సముద్ర తీరంలో జిల్లా గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఐదు కోట్ల వత్తులతో సముద్రునికి మహా కుంభహారతి అందించారు.

స్వయంభు భోగి గణపతి పీఠం నుంచి నవరాత్రి దీక్షలు చేపట్టిన మహిళా సమితి సభ్యులు సముద్ర తీరానికి చేరుకుని ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 మంది మహిళలకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. సముద్ర తీరంలో నిర్వహించిన మహా కుంభహారతి భక్తులను ఆకట్టుకుంది.

జిల్లా గణేశ ఉత్సవ సమితి అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ.. గోదావరి వంటి నదులకు గంగాహారతి నిర్వహించే సంప్రదాయం ఉన్నట్లే, నదులన్నీ కలిసే సముద్రానికి పూర్ణకుంభహారతి ఇవ్వడం సనాతన సంప్రదాయంలో భాగమని తెలిపారు. ప్రకృతి, పంచభూతాల పట్ల గౌరవాన్ని చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.

జిల్లా కమిటీ కార్యనిర్వహక అధ్యక్షుడు రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. లోకకళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ తొమ్మిది రోజుల గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోటి వత్తులతో హారతి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వాటికి ముగింపుగా ఐదు కోట్ల వత్తులతో సముద్రునికి కుంభహారతి అందించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో బొలిశెట్టి వెంకటరామకృష్ణ, పెండెం సత్యనారాయణ, పితాని లీలావతి, చామర్తి నాగమణి, నక్కా సత్య, సతీష్, మురాలశెట్టి నాగమణి, వీర ప్రభాకరరావు, గుత్తుల గంగాభవాని, సత్యనారాయణ, మేకా మల్లికాశివ, దేవరపల్లి విజయలక్ష్మి, వెంకటేష్, వేధుల గణేష్, పాలిక నాగబాబు, సీ.రెడ్డి రమేష్, కోలా ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :