contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలకు మొగులోజు రాకేష్ నామినేషన్

కరీంనగర్ టౌన్ : ప్రముఖ అంతర్జాతీయ సేవా సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) కరీంనగర్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి మొగులోజు రాకేష్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ.. సేవా దృక్పథంతో సమాజానికి మరింత విస్తృతంగా సేవలందించాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగుల సమస్యలు, అభిప్రాయాలను జిల్లా స్థాయి సేవా వేదికపై వినిపించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

తోటి ఉద్యోగులు అందిస్తున్న సహకారం, ఉద్యోగ సంఘాల ప్రోత్సాహం తనపై మరింత బాధ్యతను పెంచిందని రాకేష్ తెలిపారు. నామినేషన్ దాఖలు సందర్భంగా తనకు మార్గదర్శనం చేసి, ఆశీస్సులు అందించిన జిల్లా పంచాయతీ అధికారి (DPO), జడ్పీ సీఈఓ, డీఆర్‌డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎంపీడీవోలు, ఎంపీఓలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాకేష్ నామినేషన్ కార్యక్రమంలో టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జీవో కార్యదర్శి సంగం లక్ష్మణరావు, ఐఆర్‌సీఎస్ మాజీ చైర్మన్ కేశవరెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోదారి అజయ్ తదితరులు పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు.

ఐఆర్‌సీఎస్‌లో లైఫ్ మెంబర్‌షిప్ కలిగిన ఉద్యోగులు, సభ్యులు, శ్రేయోభిలాషులు తనకు మద్దతు అందించి ఎన్నికల్లో విజయం సాధించేలా సహకరించాలని రాకేష్ విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :