contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

8 నెలలుగా ఖాళీగా కార్పొరేటర్ల పేర్ల గోడ

గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రవేశద్వారం వద్ద కార్పొరేటర్ల పేర్లను ప్రదర్శించాల్సిన గోడ గత ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉండటంపై బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్, 58వ డివిజన్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య ప్రశ్నించారు.

ప్రజల ఓట్లతో ఎన్నికైన కార్పొరేటర్ల పేర్లను కార్యాలయంలో ప్రదర్శించకపోవడం సరికాదని ఆయన అన్నారు. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తికాకపోవడాన్ని కారణంగా చూపుతూ పేర్లను ప్రదర్శించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే ఎన్నికైన కార్పొరేటర్ల పేర్లను వెంటనే గోడపై ఏర్పాటు చేసి, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయిన తర్వాత వారి పేర్లను కూడా చేర్చవచ్చని సమ్మయ్య సూచించారు. ఈ అంశంపై రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

గోదావరి బ్రిడ్జి వద్ద తాగునీటి కొరత

గోదావరి బ్రిడ్జి వద్ద విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బంది, ఇతర పనుల్లో పాల్గొంటున్న వారికి కనీసం తాగునీరు, ఆహారం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమ్మయ్య పేర్కొన్నారు.

వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం భారీ సంఖ్యలో ప్రజలు, విగ్రహాలు తరలివస్తున్న నేపథ్యంలో నీటి లభ్యత లేకపోవడంతో విగ్రహాలను ఒకే వరుసలో నిలిపి ఒక్కొక్కటిగా పంపించాల్సి వస్తోందన్నారు. దీంతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

నాలుగు గేట్లు ఎత్తినా బ్రిడ్జి వరకు చేరని నీరు

గోదావరిలో నీటి విడుదల అంశంపైనా సమ్మయ్య స్పందించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నాలుగు గేట్లు మాత్రమే ఎత్తి నీటిని విడుదల చేసినప్పటికీ, ఆ నీరు గోదావరి బ్రిడ్జి వరకు కూడా చేరని పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు.

గోదావరిలో భారీగా ఇసుకను లోతుగా తొలగించడం వల్ల నీరు నిల్వ ఉండే పరిస్థితి తగ్గిపోయిందని సమ్మయ్య ఆరోపించారు. ఎగువ ప్రాంతాల నుంచి నీటిని విడుదల చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయోజనం కనిపించడం లేదని అన్నారు.

ఈ సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మేకల సమ్మయ్య కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :