contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

మెదక్ : వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు మెదక్ జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలోని హెచ్‌ కన్వెన్షన్‌ హాల్‌లో బందోబస్తు విధులు నిర్వహించనున్న పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు గురువారం ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం సమయంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 600 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నిమజ్జన మార్గాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, చెరువుల వద్ద నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు. నిమజ్జన వాహనాలు నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని, వాహన డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని తెలిపారు.

చెరువుల వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా కొంటూర్ చెరువు వద్ద గజ ఈతగాళ్లు, అత్యవసర స్పందనా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పూర్తి అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

విధులు నిర్వహించే ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

ఈ బ్రీఫింగ్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, సుభాష్ చంద్రబోస్, సీఐలు సందీప్ రెడ్డి, మహేష్, కృష్ణమూర్తి, రేణుక, శైలేందర్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :