contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎన్నికల బరిలో సీనియర్ జర్నలిస్టు శ్రీకరం గోవిందరాజులు

  • వైఎస్సార్‌సీపీనా.. స్వతంత్ర అభ్యర్థిగానా?
  • మున్సిపల్ ఎన్నికల వేళ ఆసక్తికరంగా మారిన రాజకీయ సమీకరణాలు

అనంతపురం – గుత్తి: గుత్తి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సీనియర్ పాత్రికేయుడు, ఉపాధ్యాయుడు శ్రీకరం గోవిందరాజులు ఎన్నికల బరిలోకి దిగనున్నారనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది. ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

శ్రీకరం గోవిందరాజులు వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తారా, కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతారా, లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే దీనిపై శ్రీకరం గోవిందరాజులు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి

శ్రీకరం గోవిందరాజులకు విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి, అవగాహన ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థి నాయకత్వ ఎన్నికల్లో తన స్నేహితులను పోటీలో నిలబెట్టి గెలిపించిన అనుభవం ఉందని వారు పేర్కొంటున్నారు.

ఇంటర్మీడియట్‌ సమయంలో సెక్రటరీ పదవికి జరిగిన ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీ చేయగా, అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన అనుభవం కూడా శ్రీకరం గోవిందరాజులకు ఉందని తెలుస్తోంది. అనంతరం యూనివర్సిటీ స్థాయిలో స్టూడెంట్స్ యూనియన్‌లో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉన్నట్లు సమాచారం.

విద్యారంగంలోనూ సుదీర్ఘ అనుభవం

పాత్రికేయ రంగంతో పాటు విద్యారంగంలోనూ శ్రీకరం గోవిందరాజులకు సుదీర్ఘ అనుభవం ఉంది. గుత్తిలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల, ఎంఎస్ డిగ్రీ కళాశాల, శ్రీ సాయి జూనియర్ కళాశాల, శ్రీ లక్ష్మీకాంత జూనియర్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, అలాగే పెద్దవడుగూరులోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో టీచింగ్ అసిస్టెంట్‌గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని సమాచారం. విద్యారంగంలో ఉన్న పరిచయాలు, పట్టణంలోని వివిధ వర్గాలతో ఉన్న సంబంధాలు, స్నేహబంధాలు ఆయన ఎన్నికల బరిలోకి వస్తారనే ప్రచారానికి మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ఏ పార్టీ.. ఏ వార్డు?

శ్రీకరం గోవిందరాజులు ఎన్నికల్లో పోటీ చేస్తే గుత్తి మున్సిపల్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న దానిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు, ఏ వార్డు నుంచి బరిలోకి దిగుతారు, లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం శ్రీకరం గోవిందరాజులు ఎన్నికల బరిలోకి దిగనున్నారనే ప్రచారం గుత్తి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతే ఎన్నికలపై ఆయన పాత్ర, పోటీ చేసే విధానం తదితర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :