మాచర్ల : పట్టణంలోని స్థానిక నారాయణ స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు, తాము నేర్చుకున్న అంశాలను స్వయంగా వివరించేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి ABC హాస్పిటల్ డాక్టర్ పద్మజ రెడ్డి, నారాయణ స్కూల్ ఆర్అండ్డీ హెడ్ మారియా, పల్నాడు జిల్లా క్లస్టర్ ప్రిన్సిపాల్ జానకి రామిరెడ్డి, ప్రీ-ప్రైమరీ ఇన్చార్జి, ఈ కిడ్స్ జెడ్సీ ఓ రీహనీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ముఖ్య అతిథులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వివిధ విద్యా అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు, ఫోటోలు, ఇతర నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. తాము నేర్చుకున్న విషయాలను అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు విద్యార్థులు స్వయంగా వివరించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి మాట్లాడుతూ.. గత నాలుగు నెలల్లో విద్యార్థులు నేర్చుకున్న విద్యా అంశాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ముఖ్య అతిథుల ముందు ప్రదర్శించి వివరించేలా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం, ఆత్మవిశ్వాసం వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
విద్యార్థులు తమ ప్రాజెక్టులు, ఫోటో ఎగ్జిబిషన్‌ను ఉత్సాహంగా వివరించడంతో కార్యక్రమం సందడిగా సాగింది. విద్యార్థుల ప్రతిభను చూసిన ముఖ్య అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.








