contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎపి కేబినెట్ మీటింగ్ … కీలక నిర్ణయాలివే

అమరావతి : సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అమరావతిలో 2 వేల 733 కోట్ల పనులకు సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. సీఆర్‌డీఏ 44వ సమావేశంలో తీసుకున్న రెండు పనులకు మంత్రివర్గం ఆమోదించింది. మున్సిపల్‌ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల జారీ అధికారంపై నిర్ణయం తీసుకుంది. అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్టసవరణ చేసింది.

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచడంపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదించింది. ఎస్‌ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఎస్‌ఐపీబీ ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు అమోదించింది. పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబ‌డుల‌కు ఆమోదించింది. రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎన‌ర్జీలో 83 వేల కోట్ల పెట్టుబడుల‌కు మంత్రివర్గం అమోదం తెలిపింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :