contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీలో ‘ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్’ విధానాన్ని సరళతరం చేయాలి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పౌర సేవలను మరింత వేగవంతం చేయడంతో పాటు సామాన్య ప్రజలు సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులను తగ్గించేందుకు తెలంగాణ తరహాలో సరళమైన ‘ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్’ విధానాన్ని అమలు చేయాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జి.ఒ.ఎమ్‌.ఎస్. నంబర్ 172 ఆధారంగా పౌరుల రేషన్ కార్డు డేటాబేస్‌ను వినియోగించి ఎలక్ట్రానిక్ ఫ్యామిలీ రిజిస్టర్ రూపొందించిందని తెలిపారు. మీసేవా కేంద్రాల ద్వారా కేవలం రూ.62 సేవా రుసుముతో, ఎలాంటి విఆర్ఓ భౌతిక విచారణ లేకుండా, రెండు పని దినాల్లో డిజిటల్ సంతకంతో కూడిన సర్టిఫికెట్ జారీ చేసే విధానం అమలులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్’ పొందేందుకు ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని రమణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్, రేషన్ కార్డులు వంటి గుర్తింపు పత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి విచారణ పేరుతో సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG), స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల డేటాను ఆధారంగా చేసుకుని సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని ఆయన సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే 48 గంటల్లో ఆటోమేటిక్‌గా డిజిటల్ సంతకంతో కూడిన ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అంతేకాకుండా ఈ సర్టిఫికెట్‌ను అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలకు **‘వన్ స్టాప్ ఐడెంటిటీ డాక్యుమెంట్’**గా గుర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధానం అమలైతే కాకినాడ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని రమణరాజు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :