అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, సామాజిక సేవా నాయకులు మరియు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని గుంతకల్లు రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి టిడిపి బాధ్యుడు గుమ్మనూరు ఈశ్వర్, పట్టణ కన్వీనర్ ఎంకే చౌదరి, బి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అలాగే ఎన్టీఆర్ సర్కిల్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైయస్సార్ సిపి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వరలక్ష్మి, మాజీ ఎంపీపీ విశాలాక్ష్మి, మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా పాల్గొన్నారు. జనసేన పార్టీ తరఫున పట్టణ కన్వీనర్ పాటిల్ సురేష్, చిన్న వెంకటేశులు, బోయగడ్డ బ్రహ్మయ్య, బిజెపి పార్టీ నుండి నూరుల్లా సన్, నారాయణరెడ్డి, సిపిఐ నుంచి రామదాసు, నాగార్జున, సిపిఎం తరఫున వి. నిర్మల, మల్లికార్జున, మైనార్టీ నాయకుడు అబ్దుల్ హక్ పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ కుల సంఘాల ఆధ్వర్యంలో తురకపల్లి ఈరన్న, అంజన్ ప్రసాద్ నేతృత్వంలో స్థానిక ప్రాంతం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఇదే సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ సూర్యనారాయణ మరియు రెవెన్యూ సిబ్బంది, కర్నూలు రోడ్డులోని శాంతి ప్రియ హాస్పిటల్‌లో డాక్టర్ శాంతి ప్రియ, పెన్షనర్స్ భవనంలో ఆబుబకర్, జెన్నీ కుళ్లాయి బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత ఆశయాలను సాధిద్దాం అంటూ నినాదాలు చేస్తూ, కేకులు కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని, భోజన వితరణ కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మరియు కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








