విజయనగరం జిల్లా బాడింగి కేంద్రంలో శ్రీశ్రీ పోలమాంబ తల్లి గుడి ప్రతిష్ట మహోత్సవం ఈ రోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ పర్వదర్శన కార్యక్రమాన్ని ఎడవల్లి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో మూడు రోజుల నుండి 11 మంది బ్రాహ్మణులతో నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా హోమాలు, వామశాల పూజలు, విజ్ఞేశ్వర స్వామి పూజలు, అమ్మవారి ఊరేగింపులు, విగ్రజలాభిషేకం, అభిషేకాలు, సూర్య నమస్కారాలు, రుద్రభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
.