contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

స్వచ్ పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బీజేపీ మండల అధ్యక్షుడు నికేష్

గన్నేరువరం : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ గన్నేరువరం మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక హైస్కూల్ మైదానంలో “టిఫిన్ బైఠక్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 13న నిర్వహించనున్న “స్వచ్ పాఠశాల” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాలల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించడం సమాజం మొత్తం బాధ్యత అని అన్నారు.

స్థానిక ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి పాఠశాలల పరిశుభ్రత, అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. సమాజంలోని ప్రతి వ్యక్తి పాఠశాలల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తే భావితరాలకు మెరుగైన విద్యా వాతావరణం అందించగలమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు అరికాంతపు అనిల్, మచ్చ బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శులు పుల్లెల రాము, బొమ్మడి సురేందర్ రెడ్డి, కార్యదర్శి బూట్ల సంపత్, కార్యవర్గ సభ్యులు జాలి శ్రీనివాసరెడ్డి, నందికొండ సురేందర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు మునిగంటి లింగయ్య, కార్యకర్తలు గట్టు కిషన్, బోగిని వేణు, చింతల శ్రీనివాస్, బోయిని మధు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :