contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

18 ఏళ్ల బాలుడి సజీవ సమాధి …

18 ఏళ్ల బాలుడు తాను చనిపోతున్నానంటూ ఒక లేఖ రాసి పెట్టి, ఇల్లు వీడాడు. కానీ, అతడు ప్రాణాలు తీసుకోలేదు. విధి అతడి ప్రాణాలను బలిగొంది. బెంగళూరులో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హోస్కేట్ టౌన్ ఖాట్మండు లేఅవుట్ నివాసి అయిన సోమనాథ్ చదువుల్లో మెరికల్లాంటి విద్యార్థి. ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాడు. తన సహచర విద్యార్థులతో అతడికి గొడవ జరిగింది. చిన్న విషయానికే చంపుతామని స్నేహితులు అతడ్ని బెదిరించారు. దీంతో భయపడిపోయిన సోమనాథ్ ఈ నెల 4న ఉదయం ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు .

స్నేహితులు తనను చంపుతామని బెదిరించారని.. తానే చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఒక లేఖ రాసి పెట్టాడు. తన స్నేహితులను ఏమీ అనొద్దని కోరాడు. అతడి తండ్రి ఇంటరియర్ డిజైనింగ్ కంపెనీలో వుడ్ వర్క్ చేస్తుంటాడు. శనివారం ఉదయం మారతళ్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి ముందు.. ఇసుకను ట్రక్ నుంచి అన్ లోడ్ చేస్తుండగా సోమనాథ్ శవం బయటపడింది. అతడి జేబులోని మాస్క్ ఆధారంగా పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :