కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. కొద్ది సేపటి క్రితమే దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్ మొదలయ్యింది. కోకర్‌నాగ్ ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ బృందాలు గాలింపు చేపట్టాయి. భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో పోలీసు బలగాలు కూడా ఎదురు కాల్పులు జరుపుతున్నారు. ఇరు వైపుల నుంచి కాల్పులతో కోకర్‌నాగ్ పరిసరాలు దద్దరిల్లాయి
