నెల్లూరు జిల్లా : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్ లో ఉత్తమ ఎన్ఎస్ఎస్ అవార్డు తీసుకొని ఆదివారం ఉదయం వేదాయపాలెం గాంధీనగర్ స్వగృహంకు చేరుకున్నా చుక్కల పార్థసారథికి విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తాళాలు తప్పట్లతో పూలమాలలు వేసి శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా స్టేట్ ఎన్ఎస్ఎస్ అవార్డు తీసుకున్న సాత్విక కు మరియు పార్థసారథికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సన్మానం చేశారు.