contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు(CHW) ఉపాధి పని కల్పించి అన్ని విధాలుగా ఆదుకోవాలి: సిఐటియు

పార్వతీపురం మన్యం జిల్లా:కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు ఉపాధి పని కల్పించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం కొమరాడ ఎంపీడీవో యల్ వి అప్పారావుని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఎంపీడీవో కార్యాలయం నుండి పత్రికా విలేకరులతో సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల మండల నాయకులు కే దుర్గ మాట్లాడుతూ…కొమరాడ మండలంలో కోనేరు రామభద్రపురం, కోమరాడ. మాదిలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 1 50 మంది వరకు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు తమ విధులు నిర్వహిస్తున్నారని, ఇలాంటి సందర్భంలో ప్రతి నెలకు 4000 రూపాయలు గాను పని చేసే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో విసులుబాటు చూసుకొని ఉపాధి పనికి గతంలో వెళ్లే పరిస్థితుందని ఆ ఉపాధి పని కూడా నిన్న అనగా లక్ష్మివారం నుండి ఉపాదామి సిబ్బంది పనికి రావద్దని చెప్పడం జరిగిందని ఇది చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం ఎందువల్ల అంటే ఈరోజు ఉపాధి కూలీలుతో పాటు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు కూడా అన్ని విధాలుగా పని కల్పించాలని ఎందుకంటే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పూర్తి కాలం పనిచేసినప్పుడు కూడా తగినంత వేతనం లేక ఆర్థిక ఇబ్బందులతో అప్పులు పాలై పరిస్థితి ఉందని ఏది ఏమైనా ఈ వ పనులకు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు వద్దనడం సరికాదని ఎంపీడీవో కి తెలియజేయడం జరిగిందన్నారు,వెంటనే ఎంపీడీవో మాట్లాడుతూ… రోజు తప్పించి రోజు ఉపాధి పనులు కలిపిస్తామని చెప్పడం జరిగిందని ఇది కాదని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు కూలీలతో పాటు కూడాప్రతిరోజు పని కల్పించాలి అన్ని విధాలుగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆదుకోవాలి తప్ప రోజు తప్పించి రోజు పని కల్పిస్తే ఏమి లాభమని దీనివల్ల కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని కావున వెంటనే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు గాను ఉపాధి పనులు మిగతా కూలీలాగా కల్పించాలని అన్ని విధాలుగా ఆదుకోవాలని లేని యెడల భవిష్యత్తులో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మండలంలో పనిచేయుచున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్ అందరితోకలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేద్దామని ఈ సందర్భంగా తెలియజేయు చున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, మంజు,రవణమ్మ, పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :