contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

THE REPORTER TV

దళారి మూవీ పోస్టర్ రిలీజ్

కరీంనగర్ జిల్లా: దళారి మూవీ ఈనెల 15వ తేదీన విడుదల కానున్న సందర్భంగా గన్నేరువరం మండలం లోని ఖాసీంపేట శ్రీ మానస దేవి ఆలయంలో పురోహితులు నాగ సాయి శర్మ ఆధ్వర్యంలో సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న ముఖ్యఅతిథిగా పాల్గొని దళారి మూవీ సక్సెస్ కావాలని దళారి మూవీ యాక్టర్ రాజ్ కోటి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దళారి మూవీ పోస్టర్ ను విడుదల చేశారు. మన కరీంనగర్ ముద్దుబిడ్డ దళారి మూవీ డైరెక్టర్ కాచిడి గోపాల్ రెడ్డి, ప్రొడ్యూసర్ ఎడవల్లి వెంకటరెడ్డి, ఆకృతి క్రియేషన్ నిర్మించిన దళారి చిత్రమును మండల ప్రజలు చూడాలని ఈ సినిమాలో మండల కేంద్రానికి చెందిన రాజ్ కోటి నటించడం చాలా సంతోషకరమన్నారు, అలాగే ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా అనిల్ రెడ్డి చేయడం సంతోషంగా ఉందన్నారు. దళారి సినిమా టీం కి గంప వెంకన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో తేళ్ల రవీందర్, మ్యాదరి శ్రీనివాస్, రాజు,ఆంజనేయులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :