ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజక వర్గం మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ‘వ్యూహం’ సినిమా సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ నేత M. రామలింగం ఫిర్యా దు చేశారు. దీంతో మద్దిపాడు పోలీస్ స్టేషన్లోలో ఐటీ చట్టం కింద RGVపై కేసు నమోదు చేశారు. కాగా చంద్రబాబు, పవన్, లోకేశ్లపై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ కార్య కర్తలను ఇప్పటికే అరెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో “వ్యూహం” సినిమా సమయంలో దర్శకుడు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర మాధ్యమాల ద్వారా అభ్యంతరకరమైన పోస్టులను పెట్టడం వలన ఈ కేసు నమోదైనట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.