కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం తో పాటు వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు శుక్రవారం సందర్శించారు, అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కనుకయ్య కి వినతి పత్రం ఇచ్చారు, అనంతరం వారు మాట్లాడుతూ సెంటర్ల లో సీరియల్ ప్రకారం కంటా వేయకుండా ఇష్టనురీతిలో కంటా వేస్తున్నారని మండిపడ్డారు. ఇదేమిటి అని అడిగితే రైతులతో సెంటర్ నిర్వాహకులు వాగ్వదానికి దిగుతున్నారు. వడ్లు పోసి నేల రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సీరియల్ ప్రకారం కంటా వేయాలని కోరారు. కంటా వేసిన ధాన్యన్ని రైస్ మిల్లులకు తరలించాలి అని అన్నారు. ఎటువంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అని అన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతల అంజిరెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం,సహాయ కార్యదర్శి కూన మల్లయ్య, గ్రామ కార్యదర్శి బోయిని మల్లయ్య, మండల నాయకులు నయ్యం, రాజమల్లు, కళ్లెం పోచయ్య, జాలి గోపయ్య తదితరులు పాల్గొన్నారు.









