contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

THE REPORTER TV

కేటీఆర్ పై ఫైర్ అయిన సీతక్క .. !

బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను అధికారం పోయిందన్న బాధ వెంటాడుతోందని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చారంటూ అంతకుముందు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై సీతక్క ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకులకు అంత తొందరపాటు పనికి రాదన్నారు. అధికారం పోయిందన్న బాధ వారిలో కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.

ఎన్నికల ప్రచారం సమయంలో తాము ఇచ్చిన హామీలకు.. బీఆర్ఎస్ మరిన్ని జోడించి చెప్పిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు వారు ఎలా ప్రశ్నిస్తున్నారని, ఇచ్చిన ప్రతి హామీని తాము నెరవేరుస్తామని వ్యాఖ్యానించారు. ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటామన్నారు. కాంగ్రెస్ గెలిచిందని ప్రజలంతా సంతోషపడుతున్నారని చెప్పారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :