గోదావరిఖని : అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి పలువురు బీజేపీ అగ్రనేతలను హైదరాబాద్‌లోని వారి నివాసాల్లో కలిసి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్లను వారి నివాసాల్లో కలిసి కందుల సంధ్యారాణి రాఖీ కట్టారు. అనంతరం వారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ.. రాఖీ పండుగ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి మాత్రమే పరిమితం కాదని, సోదరభావం, పరస్పర విశ్వాసం, ఆత్మీయత, సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. కుటుంబాల్లో ఉన్న ప్రేమాభిమానాలు సమాజం మొత్తం విస్తరించాలని, ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
దేశ రక్షణ, ప్రజా సేవ, సమాజ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకులకు రాఖీ కట్టి వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
రాఖీ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందం, ఆత్మీయత, సోదరభావాన్ని నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కందుల సంధ్యారాణి ఆకాంక్షించారు.








