contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రిపోర్టర్ టీవీ కథనానికి స్పందన .. పసికందు విక్రయానికి బ్రేక్

హైదరాబాద్: రిపోర్టర్ టీవీలో ప్రసారమైన పసికందు విక్రయ వ్యవహారంపై కథనానికి స్పందన లభించింది. పెద్ద అంబర్‌పేట్ పరిధిలోని పోచమ్మ కాలనీకి చెందిన రమేష్ దంపతులు ఓ పసికందును రూ.1.10 లక్షలకు ఇతరులకు విక్రయించినట్లు వెలుగులోకి వచ్చిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న బాల రక్షక్ బృందం రంగంలోకి దిగి పసికందును గుర్తించి, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. పసికందు విక్రయానికి సంబంధించిన వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.

పసికందును ఎవరికి విక్రయించారు? మధ్యవర్తుల పాత్ర ఏంటి? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

పిల్లల అక్రమ విక్రయాలు, బాలల హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రిపోర్టర్ టీవీ కథనానికి స్పందనగా పసికందును రక్షించడంపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

పసికందు విక్రయం? వనస్థలిపురంలో సంచలనం

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :