ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల జోరుకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, కేంద్రం దిగుమతి సుంకాల్లో మార్పులు వంటి కారణాలతో శుక్రవారం దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దీంతో వినియోగదారులకు కొంత ఊరట లభించింది.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, మే 15 ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,240 తగ్గి రూ.1,60,090 వద్ద నమోదైంది. అదే విధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా రూ.2,050 తగ్గి రూ.1,46,750 వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారం బాటలోనే వెండి కూడా పతనమైంది. కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.3.05 లక్షల వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,090గా ఉండగా, ఢిల్లీలో రూ.1,60,240గా నమోదైంది. చెన్నైలో మాత్రం కొద్దిగా ఎక్కువగా రూ.1,63,390 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.3.05 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరల్లో ఒక్కసారిగా వచ్చిన ఈ భారీ తగ్గుదల మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.








