ఆన్లైన్ న్యూస్ పోర్టళ్లకు ఇప్పటిదాకా గూగుల్, ఫేస్ బుక్‌లు వాణిజ్య ప్రకటనల ద్వారానే నామ మాత్రపు చెల్లింపులు చేస్తున్నాయి. అయితే కెనడా ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన చట్లం అమల్లోకి వస్తే.. ఇకపై ఆయా సైట్లకు వార్తల ఆధారంగానూ ఫేస్‌బుక్, గూగుల్ డబ్బు చెల్లించక తప్పదు. ఈ మేరకు కెనడా సాంస్కృతిక శాఖ మంత్రి పాబ్లో రోడ్రిగ్స్ కొత్త బిల్లును ఆ దేశ చట్టసభలో ప్రవేశపెట్టారు.
ఆన్‌లైన్ న్యూస్ యాక్ట్ పేరిట కెనడా ప్రభుత్వం ఈ కొత్త బిల్లును రూపొందించగా.. ఆ దేశ చట్టసభలో దీనికి ఆమోదం లభిస్తే..ఇకపై ఆ దేశం కేంద్రంగా పనిచేసే వెబ్ సైట్లకు వార్తల ఆధారంగానూ ఫేస్‌బుక్, గూగుల్ డబ్బు చెల్లించక తప్పదు. ఈ తరహాలోనే ఆస్ట్రేలియా గతేడాది ఓ కొత్త చట్టానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
తాజాగా కెనడా చట్టసభ కూడా ఈ కొత్త బిల్లుకు ఆమోదం తెలిపితే.. తమకు వస్తున్న ఆదాయంలో ఫేస్‌బుక్, గూగుల్‌లు మెజారిటీ వాటాను వెబ్ సైట్లకు కూడా చెల్లించక తప్పదు. అయితే ఆయా సైట్లతో సంప్రదింపులతోనే ధరను నిర్ణయించుకునే వెసులుబాటు ఫేస్‌బుక్, గూగుల్‌కు కల్పించే దిశగా కెనడా కొత్త చట్టాన్ని రూపొందిస్తోంది.
Canada proposes bill to force platforms like Google, Facebook to pay for news https://t.co/0sQz8DWCBe via @gadgetsnow
— The Times Of India (@timesofindia) April 6, 2022