తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.నియోజకవర్గంలో జరగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. కార్యకర్తల సమస్యలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. పారదర్శకంగా పాలన చేస్తున్నాం. మ్యానిఫెస్టోలో చెప్పినట్టు 98శాతానికి పైగా హామీలు అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తున్నాం. 175కు 175 సీట్లు సాధించేలా అడుగులు వేస్తున్నాం. ప్రతి ఇంట్లో అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తోంది. ప్రతి కుటుంబానికి మేలు జరుగుతోంది. 175 సీట్లు సాధించడం సాధ్యమేనని’ సీఎం జగన్ పేర్కొన్నారు.