కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు హన్మoడ్ల భాస్కర్ అన్నారు. సైదాపూర్ మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాలలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం హన్మాండ్ల భాస్కర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశ సేవకు అంకితమైన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. 1969లో తెలంగాణ తొలిదశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని కూడా త్వజించిన త్యాగశీలి అని కొనియాడారు. దశాబ్దాల తెలంగాణ కల సాకారమైన వేళ స్వరాష్ట్రాన్ని మాత్రం ఆయన చూడలేకపోయారని అన్నారు. మూడు దశల ఉద్యమాలకు ఊపిరి పోసిన మహనీయునిగా కొండ లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బైరి సుధాకర్ గూడూరి రవీందర్ రెడ్డి రొడ్డ సుజాత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.