కరీంనగర్ జిల్లా: వచ్చే నెల ఫిబ్రవరి 02 నుండి 10 వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో గల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు నిర్వహణ కు తనవంతుగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ కరీంనగర్ అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి.నరేందర్ రెడ్డి 15 లక్షల విరాళాన్ని ప్రకటించారు… బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ఆలయ ఆవరణంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కరీంనగర్ పట్టణంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు తమ వంతుగా 15 లక్షల రూపాయల విరాళాన్ని బ్రహ్మోత్సవాలకు ఖర్చులకు విరాళంగా ఇస్తున్నట్లు తెలియజేశారు… ప్రథమంగా ఆలయ కమిటీ కి 15 లక్షలు ఇవ్వడం ఆనందంగా ఉందని తెలియజేశారు.
