కరీంనగర్ జిల్లా: దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న తరువాత తొలిసారిగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అల్గునూరు చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీశ్రేణులతో కలిసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి శాలువా కప్పి ఇండోర్ పూలమొక్క అందజేశారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు స్వాగతం పలికిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం వాస్ గౌడ్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జీ గోపు మల్లారెడ్డి,బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, తమ్మనవేణి రమేశ్ యాదవ్, కంది లక్ష్మినారాయణ రెడ్డి, కంది అశోక్ రెడ్డి, దుర్గాప్రసాద్, పోరండ్ల లక్ష్మారెడ్డి, నేరెళ్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.