కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి పిస్టల్స్, వెహికల్స్‌తో పాటు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
చోరీ అనంతరం నగలతో బెంగాల్‌కు పరారైన దొంగలను బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ చోరీకి బీహార్‌కు చెందిన కుఖ్యాత ‘గోల్డెన్ థీఫ్’ సుబోద్ సింగ్ మాస్టర్‌మైండ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ దోపిడీలో మొత్తం ఐదుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు, ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 13 మంది ఈ చోరీ కుట్రలో భాగమైనట్లు పోలీసులు గుర్తించారు.
ఇంకా గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్‌తో పాటు మరో 10 మంది నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.








