వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర వెనకడుగు వేసిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు చెప్పారని… ఆయన పోరాటంతో కేంద్రం వెనకడుగు వేసిందని అన్నారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది కేసీఆరేనని చెప్పారు. తాము తెగించి పోరాడాం కనుకనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకణపై కేంద్రం తగ్గిందని అన్నారు. కేసీఆర్ దెబ్బ అంటే ఇలాగే ఉంటుందని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై అధ్యయనం చేసేందుకు సింగరేణి నుంచి నిపుణుల బృందాన్ని పంపుతామని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్లాంట్ పూర్తి స్థాయిలో పని చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు.
