పల్నాడు జిల్లా మాచర్లలోని న్యూటన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాల హాస్టల్ గదిలో ఓ బీటెక్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
మృతుడు వెన్నా ప్రసాద్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఆయన కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి. ప్రసాద్ రెడ్డి స్వస్థలం మార్కాపురం జిల్లా, పెద్దారవీడు మండలం, భద్వీడు చర్లపల్లి గ్రామం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. వ్యక్తిగత, విద్యా సంబంధిత లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనతో కళాశాల ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహ విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విద్యార్థి ఆత్మహత్య వెనుక ఉన్న అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.








