తూప్రాన్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణంలో ఎర్రని వస్త్రంతో కూడిన కరపత్రాలు కలకలం రేపాయి. మున్సిపల్ కార్యాలయ ప్రధాన గేటుకు గుర్తుతెలియని వ్యక్తులు ఎర్రని వస్త్రంపై ఓ కరపత్రాన్ని అతికించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అదే సమయంలో తూప్రాన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కూడా ఎర్రని వస్త్రంతో కూడిన మరో కరపత్రం కనిపించింది. ఈ రెండు ఘటనలను పోలీసులు సీరియస్‌గా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కరపత్రాలను ఎవరు ఏర్పాటు చేశారు? వాటి వెనుక ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడంతో పాటు, కరపత్రాలను ఏర్పాటు చేసిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మున్సిపల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తూప్రాన్ పోలీసులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.








