contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చేగుంటలో ఎన్యుమరేటర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం

చేగుంట : చేగుంట మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగింపు వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జనగణన డైరెక్టర్ భారతి హోలీ కేరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరగనున్న జనగణన మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో శిక్షణ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయని వెల్లడించారు.

ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి మొత్తం 33 రకాల ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు సేకరించాలని సూచించారు. జనగణన ప్రక్రియను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జై చంద్ర రెడ్డి, స్థానిక తహసిల్దార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :