contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శ్రీ సరస్వతి ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం

అనంతపురం జిల్లా, పెద్దవడుగూరు: పెద్దవడుగూరు మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూర్వ విద్యార్థిని డాక్టర్ హర్షిత జ్యోతిప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నృత్యాలు, పాటలు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయ వేషభూషణాలను ప్రతిబింబించే ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా చిన్నారులు వేదికపై అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడటం తల్లిదండ్రులను, అతిథులను ఆకట్టుకుంది.

పాఠశాల కరస్పాండెంట్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తుకు ప్రీ-ప్రైమరీ మరియు ప్రైమరీ విద్య పునాదిగా నిలుస్తుందని తెలిపారు. ఈ దిశగా శ్రీ సరస్వతి హై స్కూల్‌లో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పీఆర్వో కృష్ణ, ప్రధానోపాధ్యాయుడు వినయ్ కుమార్, ఉపాధ్యాయ బృందం మరియు ఇతరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :