మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై BVRIT కళాశాలకు చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కళాశాల బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.