పల్నాడు జిల్లా పిడుగురాళ్ల: కాలేజీకి ఎలాంటి అనుమతులు లేకుండా పిడుగురాళ్ల పట్టణంలో నారాయణ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పర్యవేక్షించి ఎలాంటి అనుమతులు లేవని కళాశాలను సీజ్ చేయటం జరిగింది. నూతనంగా నిర్మించిన నారాయణ జూనియర్ కాలేజీ ఎటువంటి అనుమతులు పొందకుండా కల్లబొల్లి మాటలతో విద్యార్థులను చేర్చుకొని , కళాశాలలో బైపిసి కోర్సు ఉన్నదని నమ్మపలికి అడ్మిషన్ తీసుకొని నెలరోజులు గడిచినా తరగతులు నిర్వహించకుండా ఆ కోర్స్ లేదని వేరే బ్రాంచ్ కి వెళ్ళమని ఉచిత సలహా ఇవ్వడంతో తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలు నిర్వహించగా ఎటువంటి అనుమతులు లేకుండా కాలేజీ నిర్వహిస్తున్నట్టు తేలడం తో కాలేజీ ని సీజ్ చేసి విద్యార్థులను వారి గ్రామాలకు పంపడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.